Butchaiah: ప్రజా సంక్షేమానికి జగన్ పనికిరారు 16 d ago

AP : గత ప్రభుత్వంలో ఎవరికీ ఉపాధి కల్పించలేదన్నారు టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి. అగ్రవర్ణాల పేదలకు ఏమీ సాయం చేయలేదని, నష్టపోయిన రైతులకు కూడా మద్దతు ధర ఇవ్వలేదని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధిపై జగన్‌కు అవగాహన లేదని, కాంట్రాక్టర్లకు వైసీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టిన రూ.80 వేల కోట్లను కూటమి ప్రభుత్వం చెల్లిస్తోందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో దోపిడీ చేశారని, జగన్ చేసిన స్కామ్‌లన్నీ బయటకు వస్తున్నాయని పేర్కొన్నారు. మద్యం మాఫియాను పెంచి పోషించారని, తప్పు చేసిన వారంతా శిక్ష అనుభవించక తప్పదన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ భూ కబ్జాలు చేసి, రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారన్నారు.
జగన్ ప్రజా నాయకుడైతే తాడేపల్లిలోని ఇంటి చుట్టూ ఇనుప కట్టడాలు ఎందుకని ప్రశ్నించారు. ఆయన నిజంగా పేదవాడైతే తాడేపల్లి, ఇడుపులపాయ, పులివెందుల, చెన్నై, బెంగుళూరులో ప్యాలెస్‌లు ఎలా నిర్మించారో చెప్పాలన్నారు. సొంత బాబాయినే జగన్ కడతేర్చారని, తప్పు చేసి శిక్షలు తప్పించుకోవడానికి పోలీసు వ్యవస్థను కూడా దుర్వినియోగం చేశారన్నారు. ఇలాంటి వ్యక్తులు ప్రజా సంక్షేమానికి పనికిరారని, ప్రజా జీవితంలో ఉండటానికి అంతకంటే అర్హులు కాదన్నారు.
పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని, కేంద్ర సాకారంతో ఈ ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని అందులో భాగంగా కొత్త ఎయిర్ పోర్టులు, సీ పోర్టులు వస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారని, కానీ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారని భయపడుతున్నారన్నారు. జగన్ అధికారంలోకి రారాని బుచ్చయ్య స్పష్టం చేశారు.